క్యాబ్ డ్రైవర్ పనికి ఖంగుతిన్న స్వరా భాస్కర్.. ట్విట్టర్‌లో వెల్లడించిన హీరోయిన్..

-

బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. పలు విషయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటుంది ఈ భామ. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇంతకీ ఆమెకు ఎదురైన ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమిటంటే..స్వరా భాస్కర్ ప్రజెంట్ లాస్ ఏంజెల్స్‌లో ఉంది. అక్కడ ఆమె తన పనుల నిమిత్తం క్యాబ్‌ను రెంట్‌కు తీసుకుంది. క్యాబ్ ప్రయాణంలో తనకు నచ్చిన చోట షాపింగ్ చేయడంతో పాటు తన పనులను పూర్తి చేసుకుని ఇతర ప్రదేశాలను సందర్శించాలని అనుకుంది.

ఈ క్రమంలోనే ఆమె ప్లానింగ్ చేసుకుంది. కానీ, క్యాబ్ డ్రైవర్ ఆమెకు అనుకోని విధంగా షాక్ ఇచ్చాడు. స్వరా భాస్కర్ వస్తువులను దొంగిలించాడు. దాంతో తనకు ఏం చేయాలో తెలియక స్వరా భాస్కర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఊబర్ సపోర్ట్‌ వారిని ఉద్దేశిస్తూ మీ డ్రైవర్‌లలో ఒకతను తన సామగ్రి తీసుకెళ్లాడని స్వర తెలిపింది. ఊబర్ యాజమాన్యం బాధ్యత వహించి తన వస్తువులను తిరిగి ఇప్పించాలని అభ్యర్థించింది. పర్యాటకుల సమస్యలు అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టి తన సమస్యలను ఊబర్ యాజమాన్యానికి ట్వీట్ ద్వారా తెలిపింది.

స్వరా భాస్కర్ వేరే దేశానికి వచ్చిన ఒక సెలబ్రిటీ టూరిస్టునని, అక్కడ ఇలా వస్తువులు పోవడం వలన ఇబ్బందుల పాలయ్యే అవకాశాలున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఊబర్ క్యాబ్ డ్రైవర్ తన వస్తువులను పొరపాటున తీసుకున్నాడా? లేదా దొంగతనం చేశాడో తెలియజేయాల్సిన బాధ్యత ఊబర్ యాజమాన్యానిదేనని స్వరా భాస్కర్ అభిప్రాయపడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news