ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న మెగాస్టార్ సైరా సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో మూడు రోజుల టైం ఉన్నా తెలుగు సినిమాలకు విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, మార్కెట్ పీఆర్ ఎక్స్ పర్ట్ ఉమైర్ సంధు ‘సైరా’ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.
ఈయన ఇచ్చిన రివ్యూ చూస్తే.. ఇప్పుడే సినిమా చూసేయాలన్న రేంజిలో ఉంది. ఉమైర్ సైరాకు ఏకంగా నాలుగు స్టార్లు ఇచ్చాడు. సైరా ,చూస్తుంటే రొమాలు నిక్కపొడుచుకునే సన్నివేశాలతో అద్భుతమైన అనుభూతి ఉంటుందని… బాహుబలి చిత్రంలా కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడిందని…. ఏపీ అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది…. మెగాస్టార్ అభిమానులకు సైరాతో పెద్ద పండగే అని ట్వీట్ రివ్యూ ఇచ్చేశాడు సంధు.
ఇక ఉమైర్ రివ్యూ చూసిన మెగా అభిమానులకు ఇప్పుడే పూనకాలు స్టార్ట్ అవ్వడం ఖాయం. అయితే సంధు రివ్యూల వల్ల గతంలో చాలా సినిమాలకు లేనిపోని హైప్ వచ్చింది. వాటిల్లో కొన్ని హిట్ అవ్వగా… మరికొన్ని ప్లాప్ అయినవి కూడా ఉన్నాయి. సినిమాకు ముందు భారీ హైప్ వచ్చి… సినిమా విడుదల అయ్యే సరికి అందులో ఏమాత్రం కిక్ తగ్గినా అభిమానులకు నిరాశ కలుగుతోందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇక సైరా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ్, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్‌చరణ్ నిర్మాత.