‘ సైరా ‘ రన్ టైం లాక్ … ఎన్ని నిమిషాలంటే..!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చిరు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెడ్‌తో రూపొందిన సైరా నర్సింహారెడ్డి సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ పై సైరా దండయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే మెగా అభిమానుల హంగామా కూడా స్టార్ట్ అయింది. సైరా దేశ‌ వ్యాప్తంగా ఐదు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సైరా విజువల్ ఎఫెక్ట్స్ సీన్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి ఫైనల్ చేస్తున్నారట.

sye raa narasimha reddy movie runtime Locked
sye raa narasimha reddy movie runtime Locked

ఇక సైరా రన్ టైం కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. సైరా ర‌న్ టైం 2 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది అంటే మొత్తం 165 నిమిషాల పాటు సినిమా ఉంటుంది. సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యే టైం కు మరో రెండు మూడు సీన్లు కటింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. సినిమా ఎక్కడ సాగదీసిన ఫీలింగ్ లేకుండా ఉండాలని దర్శకుడు సురేందర్ రెడ్డికి చిరు సూచించినట్టు సమాచారం.

మ‌రోవైపు ఈ సినిమా నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ సన్నాహకాల్లో ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే సైరా రిపోర్ట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ బిజినెస్ డీల్స్ పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్లు సైరాపై అంచ‌నాలు ఆకాశానికి పెంచేశాయి. ఇక ర‌న్ టైం ఎక్కువుగా ఉన్న‌ట్టు ఉన్నా.. ఇలాంటి హిస్టారిక‌ల్ సినిమాల‌కు లెన్త్ ఎక్కువ‌గానే ఉంటుంది. మ‌రి ఫైన‌ల్‌గా ఎంత ర‌న్ టైం ఫిక్స్ చేస్తారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news