క‌రెంట్ షాక్ : నిన్న కార్తీక… నేడు తాప్సీ..!

-

లాక్ డౌన్ తర్వాత అధికారులు పంపిస్తున్న కరెంట్ బిల్లులు సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా షాక్‌ ఇస్తున్నాయి. సంవత్సరం మొత్తంగా కూడా రాని బిల్లు ఒక్క నెలలోనే వచ్చేసరికి ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. దీంతో అనేక మంది సామాన్యులు ప్రభుత్వాలకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్‌ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్‌ బిల్లు రాగా, తాజాగా మరో హీరోయిన్‌ తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది.

ముంబయిలోని తాప్సీ‌ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. లాక్‌డౌన్ వ‌ల‌న మూడు  నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల డైరెక్ట్ గా బిల్లు పంపించారు. అయితే సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే జూన్‌ లో దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్‌కు గురైంది. ట్వీట్టర్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్ద మొత్తం కరెంట్‌ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా తన అసంతృప్తిని వెలిబుచ్చింది. కాగా, తాప్సీ ట్వీట్‌కి ఎల‌క్ట్రిసిటీ అధికారులు వెంట‌నే స్పందించారు. అయితే క్విక్ రెస్పాన్స్‌కి షాకైన తాప్సీ లింక్‌లో ప‌ర్మీష‌న్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వెళ్లబుచ్చింది. ఇందులో ఏదో మ‌త‌ల‌బు ఉందంటూ త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news