సాహోకి వాయిస్తున్న తమన్

-

అరవింద సమేత సినిమా చూశాక ఎన్.టి.ఆర్, త్రివిక్రం లతో పాటుగా సినిమాకు సంగీత అందించిన తమన్ గురించి కూడా ప్రస్థావించడం జరుగుతుంది. తను చేసేది కాపీ మ్యూజిక్ అనుకుంటే అది మీ ఇష్టం అంటూ డైరెక్ట్ గా కామెంట్ చేసిన తమన్ సైరా టైటిల్ పోస్టర్ కు మ్యూజిక్ అందించాడు. అప్పట్లో ఆ లోగోకి తమన్ వాయించిన మ్యూజిక్ కు సూపర్ అనేశారు.

ఇక ఇప్పుడు అరవింద సమేత సక్సెస్ జోష్ లో ఉన్న తమన్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సాహో సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కు రిలీజ్ చేయాల్సి ఉండగా ప్రభాస్ కోరిక మేరకు తమన్ ఆ టీజర్ కు మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది.

సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సాహో సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news