నితిన్‌కి త‌మ‌న్నా దిమ్మ‌దిరిగే షాకిచ్చింది!

-

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా సంప‌త్‌నంది రూపొందిస్తున్న `సీటీమార్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో క‌బ‌డ్డీ కోచ్‌గా జ్వాలారెడ్డి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం ఇప్ప‌టికీ త‌గ్గ‌క‌పోవ‌డంతో మేక‌ర్స్ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని పునః ప్రారంభించ‌డానికి వెన‌కాడుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు త‌మ‌న్నా తాజాగా మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `అంధాధూన్‌` చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ రీమేక్ చేస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రో కీల‌క పాత్రలో మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాను ఎంపిక చేశారు. ఈ పాత్ర‌లో మ‌రింత స్పైసీగా క‌నిపించాలి. అయితే ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి కోటిన్న‌ర ఇస్తామంటే ముందు ఓకే చెప్పిన త‌మ‌న్నా ఇప్పుడు 2 కోట్లిస్తేనే న‌టిస్తాన‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీంతో మేక‌ర్స్ చేసేది లేక 2 కోట్లు ఇవ్వ‌డానికి అంగీక‌రించార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news