మిల్కీ బ్యూటీ లక్కీ ఛాన్స్..!

-

స్టార్ హీరోలందరితో జత కట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి లాంటి సినిమాలో నటించినా సరే అమ్మడికి ఇంకా లక్ కలిసి రావడం లేదు. ప్రస్తుతం కెరియర్ కాస్త అటు ఇటుగా సాగిస్తున్న తమన్నా ఈమధ్యనే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అనీల్ రావిపుడి డైరెక్ట్ చేస్తున్న ఎఫ్-2 సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అవకముందే మరో క్రేజీ ఆఫర్ అమ్మడి చెంత చేరింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కే సినిమా కోసం తమన్నాని హీరోయిన్ గా ఓకే చేశారట. ఖైది నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ అదరగొట్టిన చిరు ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 2019 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న సైరాలో చిరు పోర్షన్ మొత్తం డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు.

ఇక డిసెంబర్ లోనే కొరటాల శివ సినిమా ఓపెనింగ్ ఉంటుందట. సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. మరి ఒక హీరోయిన్ గా తమన్నా ఓకే అవగా సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news