Tamanna :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత దశాబ్ద కాలంగా గ్లామర్ తో, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అదే హవా కొనసాగిస్తుంది అంటే ఇక ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా మిల్క్ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరిచిపోయే అభిమానులు చాలామంది ఉన్నారని చెప్పాలి. అయతే.. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబి డైరెక్ట్ చేసిన “జై లవకుశ”లో మిల్కీబ్యూటీ స్పెషల్ సాంగ్ చేయగా…. ఇప్పుడు మరోసారి ఆమెని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య లుక్ కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.