మాల్దీవ్స్‌లో మైమరచిపోతున్న మిల్కీ బ్యూటీ.. తమన్నా ఫొటోలు వైరల్..

-

అందాల ముద్దు గుమ్మ తమన్నా భాటియా.. ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ ఫిల్మ్ తో చక్కటి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మరాఠి భాషల్లో యాక్ట్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ.. ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నూతనోత్తేజం కోసం రకరకాల కొత్త ప్లేసెస్ ను విజిట్ చేస్తుటుంది.

ప్రస్తుతం తమన్నా భాటియా.. ద్వీపకల్పం అయిన మాల్దీవ్స్‌లో రిఫ్రెష్ అవుతోంది. హ్యాపీగా ఇక్కడి వెదర్ ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మాల్దీవ్స్ బీచ్ లో దిగిన హాట్ బికినీ ఫొటోలు షేర్ చేసి నెట్టింట హీట్ పెంచేస్తోంది. పింక్ కలర్ బికినీలో దిగిన ఫొటోలో తమన్నా భాటియా చాలా అందంగా కనబడుతోంది. ఇక ఈ ఫొటో చూసి కుర్రకారు మతి పోగొట్టుకుంటోంది. అలా తరంగాలను తాకుతుంటే సంతోషంగా ఉంటుందనే క్యాప్షన్ తో తన రికార్డు చేసిన వీడియోనూ ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది తమన్నా.

తమన్నా వీడియోలు, ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. వెకేషన్ కోసం వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3, భోళా శంకర్ ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ చిత్రం తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్ కాగా, ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంలో ‘కోడ్తె’ అనే స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా భాటియా. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

https://www.instagram.com/reel/Cbo_5FsKfCo/?utm_source=ig_web_copy_link

 

 

Read more RELATED
Recommended to you

Latest news