వినయ విధేయ రామ్ చరణ్.. ఆ దర్శకుడికి పాదాభివందనం.

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించగా, వీరి నటన ఎక్స్ ట్రార్డినరీ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు లేయర్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది కొంచెం కష్టతరమైన పాత్రని ‘ఆర్ఆర్ఆర్’ స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఈ క్రమంలోనే తాను రెండు మార్కులు రామ్ చరణ్ కు ఎక్కువ వేస్తానని అన్నారు.

‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ రోల్ ఎక్స్ ట్రార్డినరీగా ఉండటం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ జన్మదిన వేడుకలు అభిమానులు చాలా ఘనంగా నిర్వహించారు. తన బర్త్ డే సందర్భంగా చరణ్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఈవెంట్‌లో ‘భోళాశంకర్’ డైరెక్టర్ మెహర్ రమేశ్ మాట్లాడుతూ రామ్ చరణ్ సంస్కారంలో తండ్రికి తగ్గ తనయుడే కాదు.. తండ్రిని మించిన వారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్త తీసుకున్నాడన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి.వినాయక్‌కు సినిమా రిలీజ్ తర్వాత ఇంటికి ఆహ్వానించి మరీ రామ్ చరణ్ పాదాభివందనం చేశాడని గుర్తు చేశారు.

అంతటి గొప్ప సంస్కారం రామ్ చరణ్ తేజ్ కు ఉందని తెలిపారు. ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి నటించిన మెగా పవర్ స్టార్… ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో ‘ఆర్ సీ 15’ ఫిల్మ్ చేస్తున్నాడు. దాని తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ‘ఆర్ సీ 16’ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news