దర్శకుడు ఓంకార్ తమ్మడు హీరోగా, తమన్నా హీరోయిన్ గా ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-3 ఇటీవల పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. చడి చప్పుడు లేకుండా సినిమా స్టార్ట్ చేసి షాకిచ్చాడు ఓంకార్. రాజుగారి ప్రాంశ్చైజీ నుంచి వస్తోన్న మూడవ చిత్రం కాండంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తొలి భాగం మంచి ఫలితాలు సాధించినా….రాజు గారి గది-2 మాత్రం ఎక్స్ పక్టేషన్స్ ను రీల్ కాలేకపోయింది. కానీ భారీ బడ్జెట్ సినిమా కావడంతో పెద్దగా నష్టాలు రాలేదు. ఇప్పుడు ఆ నమ్మకంతోనే మరోసారి తమ్ముడ్ని హీరోగా పెట్టి పార్ట్ -3 ప్లాన్ చేసాడు. అయితే ఈ సినిమా కు ఆదిలోనే హంసపాదు పడినట్లు తెలుస్తోంది. తమన్నాకి ఓంకార్ ఊహించని షాక్ ఇచ్చినట్లు ఓరూమర్ వినిపిస్తోంది.
ఓంకార్ ఇచ్చిన ట్విస్ట్ కు తమన్నాకు దిమ్మతిరిగిపోయిందిట. తమన్నాకు చెప్పిన స్టోరీ ఒకటి కాగా, ఆన్ సెట్స్ కు వెళ్లగా అందులో మార్పులు చేసి తెరకెక్కించడం మొదలు పెట్టాడుట. దీంతో పాటు అవసరమైతే సినిమాలో ఓ లిప్ కిస్ కూడా ఉంటుందని ఆన్ సెట్స్ లో చెప్పాడుట. దీంతో తమన్నాకు చిర్రెత్తికొచ్చి సినిమా నుంచి తప్పుకుందని ఓ రూమర్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ జరిగిందని..ఈ విషయాలన్ని కథ చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించిందిట. దీంతో ఓంకార్ సమాధనం లేని వైట్ ఫేస్ పెట్టాల్సి వచ్చిందిట. దీనిపై మరింత అప్ డేట్ రావాల్సి ఉంది. ఈ సినిమాకు తమన్నా కమిట్ మెంటే పెద్ద షాక్. స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసింది.
తమిళ భాషలోనూ సత్తా చాటింది. బాలీవుడ్ లోనూ తన మార్క్ చూపే ప్రయత్నం చేసింది. మిల్కీ బ్యూటీగా ఖాతికెక్కింది. అంతటి క్రేజీ భామ ఒక్కసారిగా ఓంకార్ సినిమాలో నటిస్తుందనే సరికి సినిమాకి బజ్ వచ్చింది. కానీ తమన్నా నిర్ణయమే కొందరికి ఇంకా షాకింగ్ గా ఉంది. ప్రస్తుతం తమన్నా ఇండియాస్ మోస్ట్ అవైడెట్ మూవీ సైరా నరసింహారెడ్డితో పాటు, మరో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఓ బాలీవుడ్ చిత్రానికి ఎంపికైంది.