టీమిండియా కొత్త జెర్సీల‌పై పేలుతున్న జోకులు..!

-

టీమిండియా ఆట‌గాళ్లు ధ‌రించ‌నున్న ఆరెంజ్ క‌ల‌ర్ జెర్సీలు స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ ధ‌రించే దుస్తుల్లా ఉన్నాయ‌ని కొంద‌రు పోస్టులు పెడితే.. ఆ దుస్తులు వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను డెలివ‌రీ చేసే వారు ధ‌రిస్తార‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు.

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019లో భాగంగా రేపు భార‌త్‌, ఇంగ్లండ్‌ల మ‌ధ్య వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే భార‌త్ ఆ మ్యాచ్‌లో కొత్త‌గా డిజైన్ ఛేసిన ఆరెంజ్ క‌ల‌ర్ జెర్సీల‌ను ధ‌రించ‌నుంది. సాధార‌ణంగా టీమిండియా త‌న మ్యాచ్‌ల‌లో ఎప్పుడూ నీలి రంగు జెర్సీల‌నే ధ‌రిస్తుంది. కానీ అటు ఇంగ్లండ్ కూడా దాదాపుగా అదే ర‌క‌మైన దుస్తుల‌ను ధ‌రిస్తుండ‌డంతో భార‌త్ ఆరెంజ్ క‌ల‌ర్ దుస్తుల‌ను ధ‌రించ‌నుంది.

అయితే ఇంగ్లండ్‌తో భార‌త్ మ్యాచ్ ఆడ‌నున్న సంద‌ర్భంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా ధ‌రించ‌నున్న ఆరెంజ్ క‌ల‌ర్ దుస్తుల‌ను నిన్న‌నే విడుద‌ల చేశారు. అలాగే మ‌రోవైపు భార‌త ఆట‌గాళ్లు ఇప్ప‌టికే ఆ దుస్తుల‌ను ధ‌రించి ఫొటో సెష‌న్ కూడా చేశారు. ఈ క్ర‌మంలో ఆ ఫొటోలు కాస్తా నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోల‌పై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

టీమిండియా ఆట‌గాళ్లు ధ‌రించ‌నున్న ఆరెంజ్ క‌ల‌ర్ జెర్సీలు స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ ధ‌రించే దుస్తుల్లా ఉన్నాయ‌ని కొంద‌రు పోస్టులు పెడితే.. ఆ దుస్తులు వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను డెలివ‌రీ చేసే వారు ధ‌రిస్తార‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేశారు. అలాగే.. ఆ దుస్తులు నారింజ పండ్ల‌ను పోలి ఉన్నాయ‌ని మ‌రికొంద‌రు ఫ‌న్నీగా పోస్టులు పెట్టారు. ఏది ఏమైనా.. టీమిండియా కొత్త జెర్సీలపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా మంది చాలా ర‌కాలుగా జోకులు పేలుస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version