కమల్ హాసన్ ‘థగ్‌ లైఫ్‌’లో మరో స్టార్ హీరో

-

కోలీవుడ్ స్టార్ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌ లైఫ్‌’ . మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, త్రిష, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ పవర్ ఫుల్ టీమ్లో మరో స్టార్ నటుడు భాగమయ్యాడు. తమిళ్ హీరో శింబు థగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శింబుకు వెల్ కమ్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ మూవీ నుంచి మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడని తెలిసిందే. దుల్కర్ స్థానంలో శింబును రీప్లేస్‌ చేసినట్టు సమాచారం. థగ్‌ లైఫ్‌ టీంతో మేకర్స్‌ డిజైన్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news