బిజెపిలో చేరడంపై స్టార్ హీరో క్లారిటీ…!

బిజెపిలో చేరే అంశంపై తమిళ స్టార్ హీరో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. తాను భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించాడు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవాలని, బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు. . విశాల్‌ గతంలో నడిగర్‌ సంఘం, సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ గా పోటీ చేయాలని భావించాడు. కాగా తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి పలు రాజకీయ పార్టీలు స్టార్ హీరోలను తమ పార్టీలోకి చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాయి. అయినా సరే కొంత మంది స్టార్ హీరోలు ముందుకు రావడం లేదు.