బోల్డ్‌ క్యారెక్టర్‌లోకి దిగిపోయిన తేజస్వి

-

తేజస్వి చాలా కష్టపడుతోంది. సోషల్‌ మీడియాని హీటెక్కించైనా సరే బిజీ కావాలని ట్రై చేస్తోంది. కానీ ఈ తెలుగమ్మాయి ఎంత వెస్ట్రన్‌గా ఆలోచించినా సినిమాలు మాత్రం రాట్లేదు. బోల్డ్ మూవీస్‌ చేసినా, తేజస్వి కెరీర్‌లో మార్పు రాట్లేదు. అంతే తేజస్వి ఇంక హీరోయిన్‌ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అన్న చర్చ టాలీవుడ్ సర్కిల్స్ లో నడుస్తుంది.

తేజస్వి హీరోయిన్ నుంచి మొదలుపెడితే స్పెషల్‌ సాంగ్స్‌ వరకు అన్నీ చేసింది. రామ్‌ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్స్‌తో సినిమాలు కూడా చేసింది. అయినా ఈమె కెరీర్‌ మాత్రం ముందుకెళ్లట్లేదు. ఎంత ట్రై చేసినా స్టార్డమ్ రాట్లేదు. ఆఖరికి ‘బిగ్‌బాస్‌’ కి వెళ్లొచ్చాక కూడా తేజస్వికి సరైన అవకాశాలు రాలేదు.

తేజస్వి సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్‌ ఫోటోలు అప్‌లోడ్ చేస్తూ అటెన్షన్‌ని గ్రాబ్‌ చేస్తుంది. అయితే ఇండస్ట్రీ నుంచి మాత్రం పాజిటివ్‌ రెస్పాన్స్‌ రాట్లేదు. ఇలాంటి టైమ్‌లో ‘కమిట్‌మెంట్‌’అనే బోల్డ్‌ సబ్జెక్ట్‌లో నటించింది తేజస్వి. ‘కమిట్‌మెంట్‌’లో తేజస్వి కొంచెం బోల్డ్‌ సీన్స్‌లో కూడా నటించింది. మరి యాంకరింగ్‌ నుంచి హీరోయిన్‌ వరకు అన్నీ ట్రై చేసి, ఫైనల్‌గా బోల్డ్‌ సబ్జెక్ట్‌తో వస్తోన్న తేజస్వీకి ఇప్పటికైనా బ్రేక్ వస్తుందా.. లేకపోతే మళ్లీ నిరాశే ఎదురవుతుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news