వరుణ్ నిహారిక విషయంలో తప్పు చేశాను : నాగబాబు

-

ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఉపయోగకర విషయాలను పంచుకుంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ప్రతిరోజూ ఏదో ఒక టాపిక్ ఎంచుకుంటూ నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఇటీవలే కమ్యూనికేషన్ అనే అంశాన్ని తీసుకుని తన నిజ జీవితంలో జరిగిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి చదువుకో లేకపోయినప్పటికీ తన స్పర్శ ద్వారా ప్రేమ ని చూపిస్తూ తమతో అన్ని కమ్యూనికేషన్ చేసేది అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇక పిల్లల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఏ సమస్య వచ్చినా దగ్గరికి తీసుకుని ప్రేమగా అడిగి తెలుసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అయితే తన పిల్లలు వరుణ్ నిహారిక ల విషయంలో ప్రస్తుతం తాను ఇలాగే సమస్యలను తెలుసుకుని ధైర్యం చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు కానీ ఒకప్పుడు.. ఏదైనా తప్పు చేస్తే గట్టిగా మందలించి తిట్టే వాడినని కొన్ని సార్లు కొట్టాను కూడా అంటూ చెప్పుకొచ్చాడు. వారి విషయంలో నేను చేసిన ఒకే ఒక తప్పు అదే అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news