ఇవాళ యథావిధిగా షూటింగ్ లు జరుగుతాయి – తెలుగు ఫిలిం ఛాంబర్

-

సినీ కార్మికుల సమ్మెపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ స్పందించారు. సినీ కార్మికులు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు ఫిల్మ్ ఛాంబర్ నోటీసు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి లేఖ రాలేదని.. నిర్మాతలకు ఇవాళ షూటింగ్ చేసుకోవచ్చని సూచించింది ఫిల్మ్ ఛాంబర్.

ఇవాళ నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సమావేశం ఉండనుందని.. సినీ కార్మికుల వేతనాలపై ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ. కాగా.. ఇవాళ్టి నుంచి తెలుగు సీనీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు.

వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు ఇవాళ్టి నుంచే సమ్మె కు దిగుతున్నారు. అంతేకాదు.. నేడు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యులు పిలుపు నిచ్చారు. వేతనాలు పెంచే వరకూ షూటింగ్‌లు జరగవని సినీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి సినిమా షూటింగ్‌ జరుగుతాయో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version