తెలుగు చిత్రాలు ఆ కారణంగానే చేయలేదు.. ఆషికా రంగనాథ్..!

-

శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం అమిగోస్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం అమిగోస్. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కొన్ని విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. అమిగోస్ కోసం జర్నీ ఎలా మొదలైందనే విషయంతో పాటు ఆమె వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అలాగే తెలుగు చిత్రాలు చేయకపోవడానికి కారణం అన్నీ కూడా వెల్లడించారు.

ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “చిన్నప్పటినుంచి తెలుగు పాటలు, తెలుగు పదాలు ఎక్కువగా వినేదాన్ని. దానివల్ల నాకు తెలుగు అర్థం అయ్యేది . ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. దానివల్ల నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది . తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.. డైలాగులు చెప్పడం వల్ల కాస్త నేర్చుకోగలుగుతున్నాను” అంటూ ఆమె తెలిపింది . అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఇన్నాళ్లు రాకపోవడానికి కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే..” ఈ ప్రశ్న మీరు ఇక్కడున్న దర్శకుడిని అడగాలి. ఎందుకు ఆ అమ్మాయిని కూడా తీసుకురావడానికి అన్ని రోజులు పట్టింది అని.. నిజానికి నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి.

అయితే ఆ సమయంలో నాకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం ఇలాంటి విషయాలు అన్నింటి వల్ల నేను తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యం అయ్యింది” అంటూ ఆషికా రంగనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన ఈమె హీరోయిన్గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. మరి ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news