త‌గ్గేదే లే.. అంటు డైలాగ్ చెప్పిన క్రికెట‌ర్ జడేజా

ఇటీవ‌ల విడుద‌ల అయిన పుష్ప సినిమా ఫీవ‌ర్ ఇంకా త‌గ్గ‌లేదు. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఈ సినిమా కు సంబంధించిన పోస్టు ల‌ను డైలాగ్స్ ను సోష‌ల్ మీడియా లో పోస్టు చేస్తునే ఉన్నారు. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్ పుష్ప సినిమా లోని త‌గ్గేదే లే.. అనే డైలాగ్ చెప్పారు. తాజా గా టీమిండియా క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా త‌గ్గేదే లే.. అంటు డైలాగ్ చెప్పాడు. రవీంద్ర జ‌డేజా చెప్పిన ఈ డైలాగ ను పుష్ఫ చిత్ర బృందం త‌మ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. అది చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు పున‌కాల‌తో ఊగిపోతున్నారు.

విడుద‌ల అయి ఇన్ని రోజులు అవుతున్నా.. అల్లు అర్జున్ ఫీవ‌ర్ ఇంకా త‌గ్గ‌లేద‌ని అంటున్నారు. కాగ పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన పుష్ప సినిమా లో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న హీరో, హీరోయిన్స్ గా న‌టించారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల పంట పండుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 200 కోట్ల వ‌ర‌కు కలెక్ష‌న్లు వ‌చ్చి ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.