Chiranjeevi God Father: త‌మ‌న్ లీక్స్.. చిరుతో స‌ల్మాన్ స్టెప్పులు!

-

Chiranjeevi God Father: మెగాస్టార్ చిరంజీవీ.. ఆరుప‌దుల వ‌య‌స్సులో కూడా పుల్ జోష్ లో దూసుక‌పోతున్నారు. యంగ్ హీరోల‌కు ధీటుగా వ‌రుస‌గా ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కిస్తూ పుల్ బిజీగా ఉన్నాడు. ప్రేక్షకులను పుల్ ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. ఇప్ప‌టి ఆచార్య మూవీ పూర్తి చేసుకుని..త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. తాజాగా.. మళయాలంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంతో ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది. అయితే ఈ చిత్రం
నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒక‌టి వైర‌ల్ అవుతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ ఉంటుందా? ఆ రోల్ కోసం.. బాలీవుడ్ సూప‌ర్ స్టార్, కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ ను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. అలాగే.. చిరుకోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ స్పియర్‌ను కూడా రంగంలోకి దించబోతోన్నట్టు టాక్. అయితే వీటన్నంటిపై నిజ‌మే అనేలా .. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసే.. పాట కాబ‌ట్టి ఆ మాత్రం దానికి త‌గ్గ‌ట్టుగానే ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే బ్రిట్నీ స్పియర్‌తో సంప్రదింపులు జరుపుతున్నార‌ని తెలిపారు త‌మ‌న్. అయితే.. ఆ సాంగ్ ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా? తెలుగులో పాడించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. బ్రిట్నీ స్పియ‌ర్ తో సంప్రదింపుల ఇంకా పూర్తవ్వలేదని తమన్ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ లు కలిసి ఒకే స్క్రీన్ మీద స్టెప్పులు వేయ‌నున్న‌ర‌ని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news