జర్మనీలో కరోనా కల్లోలం.. ఆల్ టైం రికార్డ్ కేసుల నమోదు.

-

యూరప్ దేశాలు కోవిడ్ కల్లోలానికి అల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జర్మనీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగుతోంది. గత వారం నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ వైద్యరంగంపై ఒత్తడి పడుతోంది. తాజాగా బుధవారం ఒకే రోజు 39,676 కేసుల నమోదయ్యాయి. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో కేసుల సంఖ్య నమోదైంది. జర్మనీలో గత ఏడు రోజుల నుంచి ప్రతీ లక్షమందికి 232 శాతం వ్యాధి వ్యాప్తి రేటు ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స అవసరమయ్యే వారి సంఖ్య బుధవారం నాటికి 2,739కి చేరుకుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు యూరోపియన్ దేశాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుందని WHO ఇప్పటికే హెచ్చిరించింది. అందుకు అనుగుణంగానే జర్మనీ, బ్రిటన్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 2022 ఫిబ్రవరి నాటికి యూరోప్ దేశాల్లో కనీసం 5 లక్షల మరణాలైనా సంభవించే అవకాశం ఉందని WHO ఇప్పటికే  హెచ్చిరించింది.

Read more RELATED
Recommended to you

Latest news