బిగ్గెస్ట్ ఫ్యాన్‌గా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ కోసం అదిరిపోయే ట్యూన్స్

సంగీత సంచలం తమన్.. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌ను ఏలేస్తున్నాడు. అల వైకుంఠపురములో చిత్రానికి అందించిన పాటలు, సంగీతం రెండు తెలుగు రాష్ట్రాలను ఏ రేంజ్‌లో ఊపేశాయో అందరికీ తెలిసిందే. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ లాంటి పాటలు సోషల్ మీడియాకు కునుకు పట్టకుండా చేస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇంకా రికార్డుల మోత మోగిస్తున్నాయి.

అలాంటి తమన్.. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో కమ్ బ్యాక్ అదిరిపోవాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే తమన్ కూడా తన నుంచి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని పలుమార్లు వెల్లడించాడు.

తాజాగా తమన్ చేసిన మరో ట్వీట్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ‘ఓ పెద్ద ఫ్యాన్‌గా చెబుతున్నా.. మొదటి పాటను విడుదల చేసేందుకు నేను ఆగలేకపోతున్నా.. మొత్తం యూనిట్ అంతా ఎంతో కష్టపడుతోంది. మా టీమ్‌కే కాకుండా ప్రతీ ఒక్కరికి ఇదెంత ముఖ్యమైందో నాకు తెలుసు… మా నుంచి బెస్ట్ ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్‌ను బెస్ట్‌గా చూపించడానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తున్నామ’ని ట్వీట్ చేశాడు.