‘సీటిమార్’ లో ‘జ్వాలా రెడ్డి’ గా తమన్నా లుక్ అదుర్స్….!!

యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల చాణక్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తిరు దర్శకత్వంలో గోపీచంద్ నటించిన ఆ యాక్షన్ మూవీ లో ఆయన సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ రా ఆఫిసర్ గా నటించాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇక ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీటిమార్.

సంపత్ నంది దర్సకత్వంలో కబడ్డీ బ్యాక్ డ్రాప్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ తో పాటు హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా భాటియా కూడా ఒక జట్టుకు కోచ్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు తమన్నా లేటెస్ట్ లుక్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాలో కబడ్డీ జట్టు కోచ్ జ్వాలా రెడ్డి గా ఆరంజ్ కలర్ డ్రెస్ లో ఉన్న తమన్నా లుక్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.

 

గతంలో గోపీచంద్, సంపత్ నందిల కలయికలో వచ్చిన గౌతమ్ నంద పెద్దగా సక్సెస్ కానప్పటికీ కూడా, సంపత్ కు ఈ సినిమా ద్వారా రెండవ అవకాశం ఇచ్చారు గోపి. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా, దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది…..!!