అది నా విజ‌యం అంటున్న మెగాస్టార్‌.. షాక్ అయిన కొరటాల శివ‌

మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయ‌డ‌మ‌నేది స‌గ‌టు ద‌ర్శ‌కుడి క‌ల‌. ఆయ‌న‌తో ఒక్క‌సారైనా యాక్ష‌న్ అని అనాల‌నుకుంటారు ప్ర‌తి ఒక్క‌రు. కానీ అది అంద‌రికీ సాధ్యం కాదు. కానీ మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగిన ఓ డైరెక్ట‌ర్ ఇప్పుడు త‌న క‌ల‌ను నిజం చేసుకుంటున్నాడు. ఆయ‌నెవ‌రో కాదు కొర‌టాల శివ‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఆచార్య సినిమా వ‌స్తోంది. అయితే ఈ సంద‌ర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్పాడు కొర‌టాల శివ‌.

కొరటాల శివ కూడా అందరిలాగే చిన్నప్పటి నుండి మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిడంట‌. ఇక ఆచార్య షూటింగ్ టైమ్‌లో మొద‌టి రోజు చిరంజీవి తన క్యారవాన్ నుండి దిగి బయటికి రాగానే డైరెక్టర్ శివ వెళ్లి తన ఉత్సాహం మొత్తం చెప్పాడంట‌.

మెగాస్టార్ తో తాను సినిమా చేయ‌డ‌మే గొప్ప విజ‌యంగా భావిస్తున్న‌ట్టు తెలిపాడంట‌. అయితే ఈ విష‌యంపై చిరంజీవి చ‌మ‌త్కారంగా స్పందిస్తూ.. నిజానికి నా సినిమాలు చూస్తూ పెరిగిన కొరటాల శివ దర్శకుడు అయ్యాక కూడా నేను హీరోగా ఉన్నాను. ఇంకా సినిమాలు చేస్తున్నానంటే ఇది నా విజయం అని చెప్పి కొర‌టాలకు షాక్ ఇచ్చాడంట చిరు. అయితే చిరంజీవి ఇంత సింపుల్‌గా ఉంటాడ‌ని తాను అనుకోలేదంటూ కొర‌టాల శివ చెప్పుకొచ్చాడు.