ఇప్పుడున్న ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటూ వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. అయితే మనదేశంలో వ్యాక్సిన్ అందక నానా ఇబ్బందులు పడుతున్నాం. కానీ అమెరికాలో మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి అక్కడి యువత పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీంతో బైడెన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి భారీ నజరానాలు, ఆఫర్లు ప్రకటిస్తోంది.
బైడెన్ సర్కార్ జులై మొదటి వారంలోగా దేశంలో 70 శాతం మందికి టీకా వేయటం పూర్తి చేయాలన్న టార్గెట్ ను రీచ్ కావడానికి శరవేగంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓహియో రాష్ట్రం ఓ అద్భుతమైన కార్యక్రమం చేపట్టింది.
వ్యాక్స్ ఏ మిలియన్ అనే ప్రోగ్రాంను రూపొందించింది. ఇందులో భాగంగా యువత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వారంలో ఒకరిని లాటరీ తీసి విజేతగా ప్రకటిస్తారు. ఆ విజేతకు ఏకంగా రూ.7కోట్ల వరకు నజరానా ఉంటుంది. ఈ వారం లాటరీ తీయగా.. 22 ఏళ్ల అబ్బిగైల్ అనే అమ్మాయి విజేతగా నిలిచింది. దీంతో ఆమె ఆ నజరానాను సొంతం చేసుకుంది. కేవలం మొదటి డోస్ వేసుకున్న ఆమెకు మిలియన్ డాలర్లుసొంతమయ్యాయి. ఎంతైనా ఆమె లక్కీ కదా. ప్రతి వారం ఇలాగే లాటరీ తీయనున్నారు అధికారులు.