పూజా హెగ్డే: ఆ సినిమా నా కోరిక తీర్చింది.. కాని!!

-

పూజా హెగ్డే హీరోయిన్ గా 2022లో ఆమె చేసిన సినిమాలలో ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీనివల్ల పూజా క్రేజ్ ప్రమాదంలో పడింది. రాధే శ్యామ్ మొదలుకుని  బాలీవుడ్ లో విడుదలైన సర్కస్ వరకు ఆమె నటించిన 5 చిత్రాలు వరసగా ప్లాప్ అయ్యాయి.ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద  పరాజయం పాలు అయ్యాయి.రీసెంట్ గా వచ్చిన పూజా హెగ్డే బాలీవుడ్ మూవీ సర్కస్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తపడింది.

అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి తన కోరిక మాత్రమే కారణం అని చెప్పింది.ఈ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలి అనేది తన చిరకాల కోరిక. అది ఇంత త్వరగా నెరవేరుతుంది అనుకోలేదు. అంటోంది పూజా. ఆయన కోసమే తాను ఎంత బిజీగా ఉన్నా.. ఈ సినిమాను చేశానంటోంది పూజాఅంతే కాదు ఆయన ఒక్క కాల్ చేయడంతో.. అసలేం ఆలోచించకుండా సినిమాను ఒప్పుకున్నా అంది.

పూజా ఇప్పుడు మహేష్ బాబు -త్రివిక్రమ్ ల SSMB28తో తిరిగి మళ్లీ లైన్ లో పడేందుకు చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఈపాటికే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో అంతకంతకు ఆలస్యమవుతోంది. గురూజీ అయినా కూడా ఈ పొడుగు కాళ్ల సుందరి కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news