‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ కు అవే కలిసి వచ్చాయి….!! 

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాల సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న సూపర్ స్టార్, ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడంతో మరింత సంతోషంగా ఉన్నారు. మహేష్ మాదిరిగానే వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ సినిమా సక్సెస్ మరింత బూస్ట్ నిచ్చింది. నిజానికి ఈ సినిమాకు తొలిరోజు కొంత మిశ్రమ స్పందన లభించింది అనే చెప్పాలి.

Mahesh Babi in MIND BLOCK song in Sarileru

యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా విల్క్షణ నటుడు ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా యాక్షన్, ఫైట్స్, ఎమోషన్స్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, సూపర్ స్టార్ మహేష్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేసి చాలా రోజులు కావడంతో, ఒక్కసారిగా ఈ సినిమా పై ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో టాక్ తో సంబంధం లేకుండా సినిమా దూసుకెళ్తోంది.

 

ఇక మొన్న వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో తమ సినిమా వారం రోజుల్లో ఓవరాల్ గా రూ.100 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అందుకున్నట్లు సినిమా యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను కొనుగోలు చేసిన చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సరిలేరు సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకుందని, అలానే మరికొద్దిరోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఆ ఫీట్ ని అందుకుంటుందని చెప్పారు. దీనితో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ బాబు, తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. ఏప్రిల్ నెలాఖరులో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనపడుతోంది….!!

Read more RELATED
Recommended to you

Latest news