రా రా భీమ్లా నాయ‌కా : ప‌వ‌న్ మ‌రియు ఫైర్ కొడుతున్నాడు అంతే!

ప‌వ‌న్ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త‌న అభిమానులు ఉర్రూత‌లూగించే క్ర‌మంలో మ‌ళ్లీ ఖాకీ చొక్కా వేసుకుని హ‌డావుడి చేస్తున్నాడు. ఈ సారి మ‌ల‌యాళం సినిమా అయ్య‌ప్ప‌నమ్‌ కోషియ‌మ్ రీమేక్ ను రానాతో క‌లిసి తీసుకువ‌స్తున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ ప‌వ‌ర్ ఫుల్ పోలీసు క్యారెక్ట‌ర్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించ‌నున్నాడ‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ చెబుతున్నాడు.

ఆయ‌న పెర్ఫార్మెన్స్ తోనే ఈ సినిమా రేంజ్ కూడా ఒక్క‌సారిగా పెరిగిపోనుంద‌ని కూడా త‌మ‌న్ చెబుతున్న మరో మాట. అంత‌రార్థం కూడా ఇదే! ఈ సినిమాపై ఇప్ప‌టిదాకా ఉన్న అంచ‌నాల‌ను త‌మ‌న్ త‌న మాట‌ల‌తో పెంచేశాడు. ఫిబ్ర‌వ‌రి 25న సంద‌డి చేయ‌నున్న ఈ సినిమాను అటు త్రివిక్ర‌మ్ ఇటు సాగ‌ర్ చంద్ర క‌లిసి హ్యాండిల్ చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. నిత్య మేన‌న్ హీరోయిన్ గా సంద‌డి చేస్తోంది.