The Kashmir Files : ది కాశ్మీర్ ఫైల్స్ రికార్డు.. 7 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్

-

యావ‌త్ భారత దేశం ప్ర‌స్తుతం చ‌ర్చించుకుంటున్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్. చిన్న సినిమాగా విడుద‌ల అయి.. నేడు ఏకంగా పాన్ ఇండియా సినిమాగా మారి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. మార్చి 11న విడుద‌ల అయిన ఈ సినిమా.. తొల‌త కొన్ని థీయేట‌ర్స్ ల‌లోనే క‌నిపించింది. అయితే ప్రేక్షకుల డిమాండ్ తో థీయేట‌ర్ల సంఖ్య పెంచుకుని రికార్డుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ సినిమా విడుద‌ల అయిన సమ‌యంలో దేశ వ్యాప్తంగా కేవ‌లం 600 థీయేట‌ర్ల‌లో న‌డిచింది.

కానీ ఈ వారం రోజుల్లోనే క‌లెక్షన్ల‌తో పాటు థీయేట‌ర్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం 4000 ల‌కు పైగా థీయేట‌ర్ ల‌లో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా న‌డుస్తుంది. దీంతో ఈ సినిమా విడుద‌ల అయిన కేవ‌లం 7 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను అందుకుంది. నిన్న‌టి తో ఈ సినిమా క‌లెక్షన్లు.. రూ. 106.80 కోట్లుగా ఉంది. కాగ రూ. 100 కోట్ల మార్క్ అందుకున్నా.. ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

ఇప్ప‌టికీ కూడా చాలా మంది ఈ సినిమా చూడాల‌ని ప్ర‌యత్నిస్తున్నారు. దీంతో ఈ సినిమా క‌లెక్షన్లు.. కేవ‌లం రూ. 100 కోట్ల మార్క్ మాత్ర‌మే కాదు.. మ‌రిన్నీ రికార్డుల‌ను సృష్టిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news