కన్నీటిని తెప్పిస్తున్న రంగస్థలం మహేష్ జీవిత గాథ..!

-

జబర్దస్త్ కామెడీ షో తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని అక్కడ తన ప్రతిభతో అందరిని అలరించి ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న వారిలో మహేష్ అచంట కూడా ఒకరు. తనదైన యాస,డైలాగ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఆయన.. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టాడు. ఇక మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇక అప్పటినుంచి ఆయనను అందరూ రంగస్థలం మహేష్ అంటూ పిలవడం మొదలుపెట్టారు.

ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత బ్లఫ్ మాస్టర్, 118, మహానటి, శ్రీనివాస కళ్యాణం, బుర్రకథ, నిన్ను తలచి, వరుడు కావలెను, డర్టీ హరి, దాస్ కా దమ్కి వంటి ఎన్నో చిత్రాలలో నటించి తన నటనతో మంచి ప్రవసంశలు కూడా అందుకున్నాడు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి పంచుకున్నారు.. అంతేకాదు తన జీవిత గాధ తెలిస్తే మాత్రం కన్నీరు ఆగవు. ఇకపోతే మహేష్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జీరో.. కేవలం నా టాలెంట్ నమ్ముకుని వచ్చాను.. ఇక చిన్నతనం నుంచే సినిమాలంటే ఇష్టం.. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్ కి వచ్చా.

అయితే నేను సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ సమయంలో నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులు ఇచ్చే స్థోమత నాకు లేదు. కనీసం జేబులో రూ. 500 కూడా లేవు.. అప్పుడు చాలా బాధనిపించింది. ఎందుకు బ్రతికున్నానా అనిపించింది. ఇక తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ నీకు సినిమాల అవసరమా అంటూ తిట్టిపోతారు. ఆ సమయంలో బాధపడ్డాను.. అయితే మొదట అవకాశం ఇచ్చింది మాత్రం డైరెక్టర్ సుకుమార్ .. రంగస్థలంలో మంచి అవకాశం ఇచ్చి నాకు గుర్తింపును అందించారు.. ఇక హైదరాబాదులో ఇల్లు లేదు.. సొంత ఊర్లో ఇటీవల ఇల్లు కట్టుకున్నాను.. అంటూ తన బాధను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు మహేష్.

Read more RELATED
Recommended to you

Latest news