టాలీవుడ్ బ్యూటీ కేథరీన్ థెరిసా మరోసారి సోషల్ మీడియాలో తన హవా చాటింది. కర్లీ హెయిర్‌తో కవ్వించే పోజులతో ఈ భామ మెస్మరైజ్ చేసింది. జిగ్‌జాగ్ ప్యాటర్న్ డ్రెస్సులో తన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కేథరీన్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
ఇద్దరమ్మాయిలు సినిమాతో కేథరీన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో తన సత్తా చాటింది. ఈ బ్యూటీ ఓవైపు టాలీవుడ్, మరోవైపు కోలీవుడ్‌లలో బిజీగా నటిస్తోంది. ఇటీవలే బింబిసార, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
చిన్నా పెద్దా తేడా లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగిం చేసుకుంటూ కేథరీన్ ఎక్కువగా లైమ్ లైట్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన సత్తా చాటుతోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. కేథరీన్ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఈ భామ అందానికి మెస్మరైజ్ అవుతున్నారు.