రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో నాలుగేళ్ళ పాటు ఒక ఊపు ఊపేసింది. కెరటం సినిమాతో పరిచయమై యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సెటిలయింది. ఈ సినిమా తర్వాత రకుల్ దాదాలు నాలుగేళ్ళ పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఒకరకంగా చెప్పాలంటే అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ తప్ప మిగతా అందరి సరసన నటించింది.
ముఖ్యంగా మెగా హీరోలతో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక తమిళంలోను రకుల్ స్టార్ హీరోల సినిమాలలో నటించి హిట్స్ అందుకుంది. ఈ మద్యే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అజయ్ దేవ్ గన్ టబు లతో కలిసి నటించింది. దే దే ప్యార్ దే అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాతో హిందీలో ఫస్ట్ సక్సస్ ను దక్కించుకుంది. అయితే అదే సమయంలో టాలీవుడ్ లో కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2 హీరోయిన్ గా చేసింది. కాని ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.
దాంతో మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు. అయితే ఈ మద్య రకుల్ టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని ఆ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో ఫాం లోకి వచ్చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని తాజా సమాచారం. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నది వాస్తవమే. కాని ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది కన్‌ఫర్మ్ కాలేదట. అంటే ఇన్నాళ్ళు రకుల్ తెలుగులో నితిన్ సరసన నటిస్తుందని వచ్చిన వార్తల్లో నిజం లేదనమాట. అయితే హిందీ తమిళం లో మాత్రం మొత్తం నాలుగు సినిమాలు కమిటయింది రకుల్ ప్రీత్ సింగ్.