శాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ధ‌రలు చాలా త‌క్కువ‌..!

-

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ భార‌త్‌లో రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ M11, గెలాక్సీ M01 పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. గెలాక్సీ M11లో 6.4 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-ఓ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, వెనుక భాగంలో 13, 5, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Samsung Galaxy M11 and M01 smart phones launched in India

గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్‌లో 5.7 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ M11 స్పెసిఫికేష‌న్లు…

* 6.4 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ టీఎఫ్‌టీ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
* 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 450 ప్రాసెస‌ర్
* 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 13, 5, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌, ఫేస్ అన్‌లాక్
* డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
* యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ M01 స్పెసిఫికేష‌న్లు…

* 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే
* 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్
* డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

శాంసంగ్ గెలాక్సీ M11 స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, మెటాలిక్ బ్లూ, వ‌యొలెట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.10,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.12,999 గా ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ M01 స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, బ్లూ, రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌ను రూ.8,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ రెండు ఫోన్ల‌నూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news