వైరల్ గా మారిన మెగా ప్రిన్సెస్ ఫోటో.. ఎంత క్యూట్ గా ఉందో..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉపాసన ,రాంచరణ్ జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ క్యూట్ జోడీలలో ఒక జోడిగా గుర్తింపు తెచ్చుకున్న వీరికి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత తాజాగా పండంటి బిడ్డకు ఉపాసన జన్మనివ్వగా అప్పుడే బిడ్డకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లంతా కూడా మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పాప ముఖాన్ని మాత్రమే చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఒకవైపు సెలబ్రిటీలు కూడా పాపపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాప గొప్ప జాతకురాలు అని.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా పాప జాతకం చెప్పేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఉపాసన ,రాంచరణ్ తమ బిడ్డ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారని.. చిన్నారి జాతకాన్ని కూడా రాయించారని తెలుస్తోంది. చిన్నారి జాతకం చాలా అద్భుతంగా ఉంది అని.. చిన్నారి జాతకంలో రాజయోగం ఉందని.. జ్యోతిష్కులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చిన్నారి వల్ల మెగా కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగిపోతాయని అంత అద్భుతమైన ఘడియలలో పాప జన్మించింది అని తెలుస్తోంది.

ఇక ఈ పాప భవిష్యత్తులో చిరంజీవిని మించిన హోదాను సొంతం చేసుకుంటుందని కూడా జ్యోతిష్కులు చెబుతున్నారు. త్వరలోనే చిన్నారికి నామకరణం కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే రామ్ చరణ్, ఉపాసనల కూతురు, మెగా ప్రిన్సెస్ చాలా అద్భుతంగా క్యూట్ గా ఉంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news