ప్రపంచవ్యాప్తంగా యోగా ఒక ఉద్యమంగా మారింది : మోదీ

-

ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ఐరాస వేదికగా జరగనున్న యోగా కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు! యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. ఈ ప్రపంచానికి భారత్‌ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి. యోగా శరీరం, మనస్సు మధ్య సమతౌల్యం ఏర్పరుస్తుంది. యోగా.. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను.” – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

“అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా దినోత్సవంతో.. ప్రపంచవ్యాప్తంగా యోగా ఒక ఉద్యమంగా మారింది. యోగా ద్వారా మన అడ్డుగోడలను, అవరోధాలను తొలగించుకోవాలి. ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌’అనే స్ఫూర్తిని ప్రపంచానికి అందించాలి.” – ప్రధాని మోదీ

Read more RELATED
Recommended to you

Latest news