గుడ్ న్యూస్ చెప్పిన ఆర్ఆర్ఆర్ టీం..”కొమ్మ ఉయ్యాల” వీడియో సాంగ్ రిలీజ్?

-

RRR పిక్చర్ రూ.1,000 కోట్ల జాబితాలోకి చేరిపోయిన సంగతి అందరికీ విదితమే. మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో ‘కొమురం భీముడో’ సాంగ్ హైలైట్ అయింది. చిత్రానికి ఈ పాట ఆయువు పట్టని చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చెప్పు లేసి కేరింతలు పెట్టించిన” నాటు నాటు” వీడియో సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది.కాగా 2022లో మోస్ట్ సెలబ్రేటెడ్ డాన్స్ నంబర్ గా ఈ పాట నిలిచింది.ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా..లిరిక్స్ చంద్రబోసు అందించాడు.రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఆలపించారు.ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశాడు.

తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అభిమానులకు మరో శుభవార్తను తెలియజేసింది.సినిమా లోని ” కొమ్మ ఉయ్యాల” సాంగ్ చాలా మంది కి కనెక్ట్ అయింది.థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఇంత అద్భుతమైన సాంగ్ ముందే ఎందుకు రిలీజ్ చేయలేదని చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.కాగా అలాంటి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది టీం.రేపు సాయంత్రం నాలుగు గంటలకు ” కొమ్మ ఉయ్యాల” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news