Big Boss OTT Telugu: ఈ వారం వరెస్ట్ పర్ఫార్మర్ అషురెడ్డి..నటరాజ్ మాస్టర్, అఖిల్ మధ్య మాటల యుద్ధం..చివరకు

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షో ఏడో వారం రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో వారి ముఖం మీద స్టాంపులు వేయాలని ‘బిగ్ బాస్’ చెప్పాడు. దాంతో కంటెస్టెంట్స్ స్టాంపులు వేస్తూనే తమ రీజన్స్ చెప్పుకుంటున్నారు. అయితే, ఎక్కువ మంది కంటెస్టెంట్స్ అషురెడ్డి ముఖం మీద స్టాంపులు వేశారు. దాంతో ఆమె డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లయింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అది నెట్టింట వైరలవుతోంది.

సంచాలక్ గా వ్యవహరించిన అషురెడ్డి ని తప్పుబడుతూ హమీద అషు ముఖంపై స్టాంపు వేసింది. నటరాజ్ మాస్టర్ తనపైన తాను స్టాంపు వేసుకుంటానని ట్విస్ట్ ఇచ్చి మరీ అషురెడ్డి ముఖంపై స్టాంపు వేశాడు. అయితే, అషురెడ్డి మాత్రం అనిల్ పై స్టాంపు వేయడానికి వెళ్లింది. ‘గ్రాబ్ ద ఫ్లాగ్’ గేమ్ లో ఆడవాళ్లు అల చేయొద్దనే కామెంట్ చేశాడని రీజన్ చెప్పింది అషురెడ్డి. అయితే, తాను అలా అనలేదని అనిల్ సమర్థించుకున్నాడు.

ఈ క్రమంలోనే ఏదో మాటల మధ్య తనకు ఇక గేమ్ అవసరం లేదని, బయటకు వెళ్తానని ఈ సారి పగులగొడ్తానని నటరాజ్ మాస్టర్ అన్నాడు. వెంటనే ఎవరిని మాస్టర్ అని అనిల్ అడిగాడు. అప్పుడు అఖిల్ జోక్యం చేసుకుని నీ పేరు తీయనపుడు ఎందుకు మాట్లాడుతున్నావ్? అని అడిగాడు. దాంతో కూర్చుని ఉన్న నటరాజ్ మాస్టర్ లేచి నిలబడగా, అనిల్ సైతం లేచాడు.

అలా వారిరువురి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. అంతటితో ప్రోమో ముగిసింది. చివరకు ఏం జరిగింది. ఈ వారం డేంజర్ జోన్ లో ఉండబోయే కంటెస్టెంట్ గా అషురెడ్డి ఉండబోతుందా? అనేది తెలియాలంటే రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news