The Warriorr : “ది వారియర్” మూవీ టీజర్ రిలీజ్.. పోలీస్ గెటప్ లో ఇరగదీసిన రామ్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే హీరో రామ్ పోతినేని. దర్శకుడు లింగుస్వామి కూడా సినిమాలకు పెట్టింది పేరు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ది వారియర్‌ అనే టైటిల్‌ ను ఇటీవలే అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. అయితే… ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ లో హీరో రామ్ పోలీస్ గెటప్ లో అదరగొట్టాడు. మొదటిసారి పోలీస్ గెటప్ చేసినప్పటికీ.. యాక్టింగ్ లో ఇరగదీశాడు. అటు ఆది కూడా విలన్ గా దుమ్ములేపేసాడు.  కాగా.. వారియర్‌ మూవీ.. జూలై 14 వ తేదీన విడుదల కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news