1. సింధు ప్రజలకు తెలియని లోహం?
A. రాగి
B. వెండి
C. ఇనుము
D. బంగారం
2. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్లబండ్లను ఏమంటారు?
A. డక్కా
B. జెక్కా
C. ఇక్కా
D. ఎక్కా
3. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు?
A. రంగపూర్
B. లోథాల్
C. సుర్కటోడా
D. కోజ్జి
4 . సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు?
A. దిల్మన్( బహ్రయాన్ )
B. మక్రాన్ (సౌదీ అరేబియాలోని పట్టణం)
C. పై రెండూ
D. పర్షియా
5 . సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం?
A. వస్తుమార్పిడి విధానం
B. వస్తుద్రవ్య విధానం
C. లోహద్రవ్య విధానం
D. కాగితపు ద్రవ్య విధానం
6 . హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది?
A. పర్తరమును
B. ప్రకృతిని
C. సూర్యుడిని
D. జంతువులను
7 . సింధు నాగరికత కాలంలో దేవాలయాలు?
A. ఉండేవి
B. ఉండేవికావు
C. అక్కడక్కడ ఉండేవి
D. ఒకేచోట ఉండేవి
8 . హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం?
A. దేవాలయాలు
B. వృత్తులు
C. ముద్రికలు
D. ఉపయోగించిన వస్తు సామగ్రి
9 . హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు?
A. అమ్మతల్లి
B. పశుపతి మహాదేవుడు
C. పతిదేవుడు
D. సూర్యుడు
10. రోపార్ ఎక్కడ ఉంది?
A. హర్యానా
B. గుజరాత్
C. పంజాబ్ (ఇండియా)
D. రాజస్థాన్
జవాబులు:
1. సింధు ప్రజలకు తెలియని లోహం?
జవాబు: C. ఇనుము
సింధు ప్రజలకు ఇనుము గురించి తెలియదు
2. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్లబండ్లను ఏమంటారు?
జవాబు: D. ఎక్కా
స్వదేశీ వర్తకం చేయుటకు ఎక్కా అనే ఎడ్లబండ్లను ఉపయోగించారు
3. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు?
జవాబు: B. లోథాల్
లోథాల్ సింధు ప్రజల ప్రధాన ఓడరేవు
4 . సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు?
జవాబు: C. పై రెండూ
సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతం నుంచి దిల్మన్, మక్రాన్‌కు తరలించి వ్యాపారం చేసేవారు
5 . సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం?
జవాబు: A. వస్తుమార్పిడి విధానం
సింధు ప్రజలు వర్తకం కోసం వస్తుమార్పిడి విధానం ఉపయోగించారు
6 . హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది?
జవాబు: B. ప్రకృతిని
హరప్పా నాగరికతలో ప్రజలు ప్రకృతి దేవతాలను ఆరాధించారు
7 . సింధు నాగరికత కాలంలో దేవాలయాలు?
జవాబు: B. ఉండేవికావు
అప్పటికి ఆలయాల సంస్కృతి లేదు.
8 . హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం?
జవాబు: C. ముద్రికలు
మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు ముద్రికలలో కనిపించాయి
9 . హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు?
జవాబు: B. పశుపతి మహాదేవుడు
హరప్పా ప్రజలు మాతృస్వామిక వ్యవస్థను కలిగి ఉన్నారు. అయినా పశుపతి మహాదేవుడుని ఆరాధించేవారు
10. రోపార్ ఎక్కడ ఉంది?
జవాబు: C. పంజాబ్ (ఇండియా)
భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో రోపార్ ఉన్నది