సినీ పరిశ్రమలో ఎంతోమంది తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవడానికి అడుగుపెడుతూ ఉంటారు. ఇక ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందో.. ఎవరూ అంచనా వేయలేరు.. కాబట్టి వచ్చిన ప్రతి సినిమాలో కూడా నటిస్తూ ఉంటారు . కానీ వారికి అవకాశాలు వచ్చినప్పటికీ సరైన పాత్రలు పడితేనే వారి భవిష్యత్తు ఉంటుంది లేదా అడపాదడపా సినిమాలు చేస్తూ ఉండి పోవాల్సిందే. ఇక దర్శక నిర్మాతలు ఎక్కువగా తమ సినిమాల్లో నార్త్ బ్యూటీలకే అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో తెలుగు అమ్మాయిలను పట్టించుకోవడం లేదు అనే అపవాద కూడా ఉంది. కానీ టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలు కూడా మంచి అవకాశాలను సొంతం చేసుకుంటున్నారని ఇటీవల ఎంతోమంది తెలుగు అమ్మాయిలు కూడా నిరూపిస్తున్నారు.
అలాంటి వారిలో తెలుగమ్మాయి అక్షర కూడా ఒకరు. నటన పట్ల ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె మొదటగా కళ్యాణ్ రామ్ హీరోగా , సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఎంత మంచివాడవురా సినిమాలో పెళ్లికూతురు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా తో ఈమెకు గుర్తింపు లభించలేదు . ఆ తర్వాత రామ్ ద్విపాత్రాభినయం చేసిన రెడ్ సినిమాలో ఇన్స్పెక్టర్ సంపత్ కూతురి పాత్ర పోషించింది. అక్కడ కూడా గుర్తింపు రాలేదు. కానీ ప్రయత్నం చేస్తూనే వచ్చిన అక్షర ఇప్పుడు పుష్ప సినిమాలో నటించడంతో ఒక్కసారిగా మంచి గుర్తింపు లభించింది అని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో అజయ్ కి భార్యగా పుష్పకి వదిన పాత్రలో నటించింది .ఇక పుష్ప టు సినిమాలో కూడా అక్షర పాత్ర నిడివి పెంచబోతున్నారట సుకుమార్. పుష్ప సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో కూడా అవకాశం లభించింది.ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర ఆట.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడమే లక్ష్యంగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.