ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ అసంతృప్తి… కారణం ఆ విషయమేనా?

-

వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. ఒకవైపు ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’లో నటిస్తూనే, మరోవైపు నాగ్‌అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌-కె’ చేస్తున్నారు. ‘కేజీయఫ్‌2’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రభాస్‌ వల్లే ప్రశాంత్‌ కాస్త ఇబ్బందిపడుతున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ముఖ్యంగా ప్రభాస్‌ ఫిజిక్‌ విషయంలో ప్రశాంత్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌ ఒకేసారి రెండు, మూడు సినిమాలు కమిట్‌ కావడంతో ఆయా పాత్రలకు తగినట్లు తన శరీరక దారుఢ్యాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. దీని వల్ల ‘సలార్‌’లో కథానాయకుడి పాత్ర కోసం ప్రశాంత్‌ అనుకున్న ఫిజిక్‌ మారిపోతూ వస్తోందని ఆయన భావిస్తున్నారు. ఒక షెడ్యూల్‌కి, మరో షెడ్యూల్‌కీ ప్రభాస్‌లో తేడా స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రశాంత్‌ సంతోషంగా లేరని టాక్‌. అయితే, దీనిపై అటు చిత్ర బృందం కానీ, ఇటు దర్శకుడు కానీ స్పందించలేదు.

సలార్‌లో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news