ఈవారం థియేటర్స్ / ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!!

-

ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా డేట్స్ బట్టి సమయాన్ని బట్టి ఒక్కోసారి పెద్ద సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒకసారి చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే జూన్ 16వ తేదీన ఆది పురుష్ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రానున్న శుక్రవారం కావలసిన అంత సందడి థియేటర్లలో కనిపించబోతుందని చెప్పవచ్చు. అలాగే ఓటీటీ లలో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

సినిమాల విషయానికి వస్తే.. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన మనుచరిత్ర వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది.
అవికా గోర్ నటించిన హిందీ మూవీ 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్
వాసంతి రవి విమలా రామన్ నటిస్తున్న హార్రర్ థ్రిల్లర్ అస్విన్స్.
ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న పవన్ దర్శకత్వంలో వచ్చిన ధూమం.

ఇక ఓటిటి సినిమాలు వెబ్ సిరీస్లో విషయానికి వస్తే..

అమెజాన్ ప్రైమ్ లో.. నరేష్, పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లి సినిమా జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఆహా లో.. నరేష్ పవిత్ర లోకేష్ మళ్లీ పెళ్లి జూన్ 23 నుంచి ప్రసారం కాబోతోంది.

రాహుల్ రామకృష్ణ నవ్య స్వామి జోడీగా నటించిన ఇంటింటి రామాయణం జూన్ 23న రిలీజ్ కాబోతోంది.

డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మలయాళీ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

జీ ఫైవ్ లో సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కి కా జాన్ మూవీ జూన్ 23 నుంచి ప్రసారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news