ఈ వారం ఓటీటీలో విడుద‌ల అయ్యే సినిమాలు ఇవే

-

ప్ర‌స్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కాలంలో థీయేట‌ర్ కు వెళ్లి.. సినిమా చూసేంత స‌మ‌యం ఎవ‌రికీ లేదు. దీంతో చాలా మంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్ లోకి ఎన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలు వ‌చ్చినా.. ఆధార‌ణ త‌గ్గ‌డం లేదు. అలాగే థీయేట‌ర్స్ లో విడుద‌ల అయినా.. సినిమాల్లో కొన్ని రోజుల్లోనే ఓటీటీ ల్లో వ‌స్తున్నాయి. దీంతో ఓటీటీ ప్రియుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. కాగ ఈ వారం ఓటీటీలో వ‌చ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి చూద్ధం.

సిద్ధు జోన్న‌ల గ‌డ్డ‌, నేహా శెట్టి హీరో, హీరోయిన్లు గా వ‌చ్చిన కామెడీ సినిమా డీజే టిల్లు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల అయి.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. హీరో సిద్ధు కేరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా డీజే టిల్లు ఉంది. కాగ ఈ సినిమా ఆహాలో మార్చి 4 వ తేదీ నుంచి ప్రసారం అవుతుంది.

అలాగే త‌మిళ స్టార్ హీరో విశాల్ హీరో గా వ‌స్తున్న సినిమా సామాన్యుడు. త‌మిళ వ‌ర్షన్ లో వ‌చ్చిన ఈ సినిమాను తెలుగు లో కూడా విడుద‌ల చేశారు. ఈ యాక్షన్ సినిమా ఫిబ్ర‌వ‌రి 4 వ తేదీన విడుద‌ల అయింది. కాగ ఈ సినిమా మార్చి 4 వ తేదీనే జీ5 లో విడుద‌ల అవుతుంది.

అలాగే జెమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్న డేనియ‌ల్ క్రెయిగ్ నో టైమ్ టు డై అనే యాక్షన్ థ్రిల్ల‌ర్ సినిమా కూడా ఈ వారంలోనే ఓటీటీ లో సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా 2021 సెప్టెంబ‌ర్ 30 న విడుద‌ల అయింది. చాలా రోజుల త‌ర్వాత మార్చి 4న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కాబోతుంది.

అలాగే అజ‌య్ దేవ‌గ‌న్ తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖ‌న్నా తో పాటు ప‌లువురు న‌టిస్తున్న వెబ్ సిరీస్ రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ . ఈ వెబ్ సిరీస్ ను హాట్ స్టార్ లో మార్చి 4 నే విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news