తెలంగాణ వాహనదారులకు శుభవార్త చెప్పింది పోలీస్ శాఖ. చలాన్లపై డిస్కౌంట్ ను ఇవాళ్టి నుంచే అమలు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ… ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలని… ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలని పేర్కొన్నారు.
ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చని… లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చని వెల్లడించారు. ఇవాళ్టి నుంచి మార్చి 30 వ తేది వరుకు ట్రాఫిక్ చలనాలు రాయితీ అమలు అవుతుందని… కరోనా కారణముగా అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ద్విచక్ర వాహనలకి 25 శాతం రాయితీ, నొ మాస్క్ చలనాలులు కూడా రూ.1000 ఉంటే రూ.100 కడితే చాలు అని తెలిపారు.
పేద వర్గాలకు వెసుల బాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోనే కేవలం 500 కోట్ల రూపాయల చాలన్ ల వరుకు అనగా 1.75 లక్షల చలనాలు పెండింగ్ లో ఉన్నాయని.. చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. తెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో ప్రాసెస్ చేస్తుందని.. నెల రోజుల వేసులబాటు లో చాలన్ కట్టకపోతే తగిన చర్యలు స్పెషల్ డ్రైవ్ పెట్టీ చేస్తామన్నారు.