ఈ వారం ఓటీటీ లో విడుద‌ల అయే సినిమా ఇవే

ఈ వారం ప‌లు ఓటీటీ ల‌లో స్టార్ హీరో సినిమా లతో పాటు మొత్తం ప‌ది సినిమా లు ఓటీటీ ల‌లో సంద‌డి చేస్తున్నాయి. సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేష్ హీరో గా వ‌స్తున్న దృశ్యం – 2 సినిమా తో పాటు సుప్రిం హీరో సాయి ధ‌ర‌మ్ రిప‌బ్లిక్ సినిమా. అలాగే ఆకాశ్ పూరి రొమాంటిక్ సినిమా, న‌వీన్ చంద్ర బ్రో సినిమా వంటి సినిమాలు ఈ వారం విడుద‌ల అవుతున్నాయి.

అలాగే ఛోరీ, హాక్ ఐ, వీన‌మ్ దిల్ బేక‌ర‌ర్, హిక్క‌ప్స్ అండ్ హుక్క‌ప్స్ వంటి సినిమా లు ఈ వారం ఓటిటి ల‌లో విడుద‌ల కానున్నాయి. కాగ స్టార్ హీరో వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర లో వ‌స్తున్న సినిమా ఈ నెల 25 న అమెజ‌న్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది. అలాగే సాయి ధ‌ర‌మ్ తేజా రిప‌బ్లిక్ మూవీ జీ5 లో న‌వంబ‌ర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే పూరీ జ‌గ‌న్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వ‌చ్చిన రొమాంటిక్ సినిమా కూడా న‌వంబ‌ర్ 26 నుంచి ఆహా లో ప్ర‌సారం అవుతుంది. దీంతో అవికా గోర్, న‌వీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర ల‌లో వ‌స్తున్న బ్రో అనే సినిమా కూ న‌వంబ‌ర్ 26 న సోనీ లైవ్ వేదిక గా ప్రేక్ష‌కుల ముందుకు వస్తుంది.