రాజేంద్రప్రసాద్ ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

-

కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించి తనకు తానుగా శ్రీశక్తి అంటూ ప్రకటించుకున్న శ్రీ రెడ్డి ఇక్కడ తన వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోవట్లేదని చిన్నగా చెన్నై చేరుకుంది. కోలీవుడ్ లో కూడా లారెన్స్, శ్రీరాంల మీద కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి లేటెస్ట్ గా నాని మీద అసభ్యకరంగా కామెంట్ చేయడమే కాకుండా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా కామెంట్స్ చేసింది.

బేవర్స్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో సినిమా వాళ్ల మీద రకరకాలుగా చేయడానికి కొందరు ఏదేదో చేస్తున్నారని వాళ్లంతా దరిద్రులు అంటూ కామెంట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్. దాదాపు ఇది తనని గురించే అని అనుకున్న శ్రీరెడ్డి రాజేంద్ర ప్రసాద్ కు బొమ్మ చూపిస్తానంటూ.. మా అసోషియేషన్ నుండి 6 నెలల్లోనే ఎందుకు తప్పుకున్నావో.. హీరోయిన్ మాళవిక ఇండస్ట్రీని వదిలి పెట్టి వెళ్లింది అందరికి తెలుసు.. నీ లైంగిక వాంఛ కోసం ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులను ఇరిటేట్ చేశావో అంటూ రాజేంద్ర ప్రసాద్ మీద కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. అంతేకాదు పర్సనల్ గా నీ కూతురు ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయిందో అందరికి తెలుసని అన్నది శ్రీ రెడ్డి. మరి శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు రాజేంద్ర ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version