రేపే విక్రమ్​ ఉగ్రరూపం ‘కోబ్రా’… ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే?

-

ప్రతి వారంలానే ఈ వారం కూడా కొన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ నెల చూసుకుంటే చిత్ర పరిశ్రమ మిశ్రమ స్పందన అందుకుంది. నెల ఆరంభంలో విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను నమోదు చేయగా, మరికొన్ని చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఇక సెప్టెంబరులో వరుస చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలేవో చూసేద్దామా!

‘అపరిచితుడు’ చిత్రంలో మూడు విభిన్న పాత్రలతో సినీ అభిమానులు మనసు దోచిన నటుడు చియాన్‌ విక్రమ్‌. ఇప్పుడాయన అంతకుమించి తన నట విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారు. ‘కోబ్రా’ సినిమాలో విక్రమ్‌ ఏడు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో విక్రమ్‌.. గణిత శాస్త్రవేత్తగా నటించారు. లెక్కల్లో మేధావి అయిన విక్రమ్‌ విభిన్న రూపాల్లోకి ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన్ను బంధించేందుకు కారణమేంటి?.. తదితర ప్రశ్నలు ట్రైలర్‌ చూస్తే ఉత్పన్నమవుతాయి, ఈ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కె.ఎస్‌. రవికుమార్‌, క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు.

కోబ్రా
కోబ్రా

ఇగోలు లేకపోతే ఏ బంధమైన అందంగా ఉంటుందనే కాన్సెప్ట్‌తో యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’ సిద్ధమైంది. వైష్ణవ్‌ తేజ్‌, కేతికశర్మ హీరోహీరోయిన్​. ఈ సినిమాతో గిరీశాయ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. నవీన్‌ చంద్ర, సుబ్బరాజు, ప్రభు, నరేశ్‌, ప్రగతి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు యువతలో ఆసక్తిని పెంచాయి. ఇక, ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు.

రంగరంగ వైభవంగా
రంగరంగ వైభవంగా

భిన్న కాన్సెప్ట్‌తో…చిత్రం: బుజ్జీ… ఇలారా..; నటీనటులు: సునీల్‌, ధనరాజ్‌, చాందినీ అయ్యంగార్‌ తదితరులు; సంగీతం: సాయి కార్తీక్‌; దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి; విడుదల: 02-09-2022

బుజ్జీ ఇలారా
బుజ్జీ ఇలారా

నవ్వులు పంచేందుకు… చిత్రం: ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో; నటీనటులు: శ్రీకాంత్‌రెడ్డి, సంచిత బసు తదితరులు; సంగీతం: రథన్‌; దర్శకత్వం: వంశీధర్‌ గౌడ్‌, పి.లక్ష్మీనారాయణ; విడుదల: 02-09-2022

ఫస్ట్​ డే ఫస్ట్​ డే
ఫస్ట్​ డే ఫస్ట్​ డే

వీటితో పాటు, ‘పుష్పరాజ్‌’, ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా..?’, ‘ఆకాశ వీధుల్లో..’ తదితర చిన్న చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి.

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే.. అమెజాన్‌ ప్రైమ్‌లో ద లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ (వెబ్‌ సిరీస్‌ తెలుగు) సెప్టెంబరు 02…… నెట్‌ఫ్లిక్స్‌లో ఐ కేమ్‌ బై (ఒరిజినల్‌ మూవీ) ఆగస్టు 31, ఫ్యామిలీ సీక్రెట్స్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 31, అండర్‌ హర్‌ కంట్రోల్‌ (ఒరిజినల్‌ మూవీ) ఆగస్టు 31 స్ట్రీమింగ్​ కానున్నాయి.

ఐ కేమ్‌ బై
ఐ కేమ్‌ బై

జీ5లో విక్రాంత్‌ రోణ (తెలుగు) సెప్టెంబరు 02, మై డియర్‌ భూతం (తెలుగు) సెప్టెంబరు 02…. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్​లో కఠ్‌పుత్లీ (హిందీ) సెప్టెంబరు 02, ఖుదా హఫీజ్‌ 2(హిందీ) సెప్టెంబరు 02 రిలీజ్ కానున్నాయి.

విక్రాంత్‌ రోణ
విక్రాంత్‌ రోణ

సోనీలివ్‌లో సుందరి గార్డెన్స్‌ (మలయాళం) సెప్టెంబరు 03, ఆహాలో పంచతంత్ర కథలు (తెలుగు) ఆగస్టు 31, ళ్లి కూతురు పార్టీ (తెలుగు ) ఆగస్టు 31 స్ట్రీమింగ్​ కానున్నాయి.

పంచతంత్ర కథలు
పంచతంత్ర కథలు

Read more RELATED
Recommended to you

Latest news