ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధర వ్యవహారం అనుకున్నట్టుగానే ఓ కొలిక్కి వచ్చింది. ఇవాళ సినిమా టికెట్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రతిపాదనలు ఫిల్మ్ ఛాంబర్ ప్రభుత్వానికి అందించగా.. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బృందం సీఎం జగన్ ను కలిసినప్పుడే అన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇవాళ నిర్థారణ కమిటీ సమావేశమై చర్చించింది.
నిర్థారణ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మేము సినిమా ఇండస్ట్రీ తరుపున మాట్లాడాం. టికెట్ల ధరలు, అన్ని అంశాలపై మాకు ఒక స్పష్టత వచ్చింది. ప్రభుత్వం అంగీకరించింది. కానీ కాస్త అటు ఇటు ఉందని వెల్లడించారు. టికెట్ల ధరలు మినిమం 40 అని వీరు ప్రతిపాదించగా ప్రభుత్వం రూ.30 అని ఫిక్స్ చేసినట్టు సమాచారం. అన్ని అంశాల్లో ప్రభుత్వం వీరి ప్రతిపాదనలు అంగీకరించింది. మరొక వైపు పవన్ కల్యాణ్ కొత్త సినిమా భీమ్లానాయక్ సినిమాతో కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.