Tiger Nageswara Rao : మాస్ మహారాజా రవితేజ చేసిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. నూతన దర్శకుడు వంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దు కుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకం పై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిచింది. అయితే రవితేజ చేసిన… టైగర్ నాగేశ్వరరావు సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.

నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా దీనిని తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాకు తెచ్చుకుంది. నెలరోజులు పూర్తికాకుండానే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇక రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో… 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు.