Tillu Square: OTTలోకి టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే?

-

Tillu Square: హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు (Tillu Square) యూత్ నీరాజనం పడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Tillu Square

బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ వసూళ్లు మంచిగా వచ్చాయి. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ మోస్ట్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. దాదాపు రూ. 14 కోట్లు పెట్టి టిల్లు గాడి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్‌ చివరి వారంలో లేదా.. మే మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్‌ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news